పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానంటూ నర్సుపై యువకుడి దాడి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానంటూ నర్సుపై యువకుడి దాడి!

  • ఆసుపత్రి వద్ద యువతిపై దాడి
  • పెళ్లాడకుంటే చంపేస్తానని హెచ్చరిక
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు
నైట్ డ్యూటీకి వెళ్లిన నర్సును ఆసుపత్రి బయట అడ్డగించిన యువకుడు ఆమెపై దాడి చేశాడు. తనను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానంటూ గొంతుపట్టుకుని హెచ్చరించాడు. చెంపపై కొట్టి తోసేశాడు. దీంతో ఆమె గాయాలపాలైంది. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఓ ఆసుపత్రిలో బాధితురాలు నర్సుగా పనిచేస్తోంది. ఆరు నెలల క్రితం యువతి తండ్రిని కలిసిన యువకుడు అనిల్ తనకు ఉద్యోగం వచ్చిందని, మీ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో అతడి గురించి వివరాలు తెలుసుకున్న యువతి తండ్రి.. అతడు చెప్పిందంతా అబద్ధమేనని, అతడు ఉద్యోగం చేయడం లేదని తెలుసుకున్నాడు. దీంతో పెళ్లికి నిరాకరించాడు.

దీంతో ఆగ్రహంతో ఉన్న అనిల్ ఆమె ఫోన్ నంబరును సంపాదించి వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగక ఈ నెల 16న యువతి నైట్ డ్యూటీ కోసం ఆసుపత్రికి రాగా, అక్కడే మాటువేసిన అనిల్ ఆమె గొంతుపట్టుకుని దాడి చేశాడు. తనను పెళ్లాడకుంటే చంపేస్తానని బెదిరించాడు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
Hyderabad
jubile hills
Nurse
Hospital
Police

More Telugu News