విజయ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం: దర్శకుడు అట్లీ కుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం: దర్శకుడు అట్లీ కుమార్

  • 'తెరి' .. 'మెర్సల్' సూపర్ హిట్స్ 
  • విజయ్ తో అట్లీ మరో ప్రాజెక్టు 
  • కథపై జరుగుతోన్న కసరత్తు    
విజయ్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'తెరి' .. 'మెర్సల్' కూడా ముందు వరుసలో కనిపిస్తాయి. విజయ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలుగా ఇవి నిలిచాయి. విజయ్ కి ఈ స్థాయి సక్సెస్ లను ఇచ్చిన దర్శకుడు అట్లీ కుమార్. ఈ దర్శకుడికి మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. అందువల్లనే పై రెండు సినిమాలకి మాస్ ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. దాంతో విజయ్ తో మరో సినిమా చేయడానికి అట్లీ కుమార్ రెడీ అవుతున్నాడు. విజయ్ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నాననీ .. ఇంతవరకూ విజయ్ చేసిన చిత్రాలకి ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని అట్లీ కుమార్ చెప్పాడు. గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'తెరి' .. 'మెర్సల్' సినిమాలకి మించి ఈ సినిమా ఉంటుందని అన్నాడు. విజయ్ క్రేజ్ ను ఆయన అభిమానుల టేస్టును దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందించనున్నాననీ .. తమ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మురుగదాస్ సినిమా చేస్తోన్న విజయ్, అది పూర్తయ్యాక అట్లీ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.   
vijay
atlee kumar

More Telugu News