పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చరణ్!
- సెట్స్ పై బోయపాటి తాజా చిత్రం
- చరణ్ సరసన కైరా అద్వాని
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
చరణ్ పాత్రను బోయపాటి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడట. తను ఇంతవరకూ చేయని పాత్ర కావడంతో, ఈ పాత్ర పట్ల చాలా ఆసక్తిగా చరణ్ వున్నాడని అంటున్నారు. బోయపాటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు .. ఇక చరణ్ కూడా మాస్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో వున్న హీరో. అందువలన ఈ సినిమాపై అందరిలోను అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి మరి. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.