సురేశ్ ప్రొడక్షన్స్ లో మల్టీస్టారర్ .. హీరోలుగా వెంకటేశ్, సూర్య!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సురేశ్ ప్రొడక్షన్స్ లో మల్టీస్టారర్ .. హీరోలుగా వెంకటేశ్, సూర్య!

  • చైతూతో కలిసి 'వెంకీ మామా '
  • వరుణ్ తేజ్ తో కలిసి 'ఎఫ్ 2'
  • పోలీస్ ఆఫీసర్ గా మరో మల్టీస్టారర్
ఒక వైపున సోలో హీరోగా చేస్తూనే .. మరో వైపున మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి కూడా వెంకటేశ్ ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా ప్రస్తుతం ఆయన నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామా' .. వరుణ్ తేజ్ తో కలిసి 'ఎఫ్ 2' సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా వెంకటేశ్ మరో మల్టీస్టారర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఒక మల్టీ స్టారర్ మూవీని ప్లాన్ చేశారట. ఈ సినిమాలో ఒక కథానాయకుడిగా వెంకటేశ్ .. మరో కథానాయకుడిగా సూర్య చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ ఇద్దరూ కూడా ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. గతంలో ఈ తరహా పాత్రల్లో ఇటు వెంకీ .. అటు సూర్య తమ సత్తా చాటుకున్నారు. ఈ సినిమాలో చేయడానికి సూర్య ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు వున్నట్టుగా సమాచారం.  
venkatesh
surya

More Telugu News