జగన్ హామీలకు కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదు: కేఈ ఎద్దేవా
- సీఎం కావాలనే కోరికతో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు
- రాజన్న రాజ్యమంటే.. అధికారులను జైలుకు పంపడమా?
- రెచ్చగొట్టే విధంగా పవన్ మాట్లాడుతున్నారు
కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులను సృష్టించినా... రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారని కేఈ చెప్పారు. బీజేపీకి జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అంటే బ్రోకర్స్ ఆఫ్ జగన్ అండ్ పవన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని జగన్ చెబుతున్నారని... రాజన్న రాజ్యమంటే అధికారులను జైలుకు పంపడమా? అని ఎద్దేవా చేశారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.