ఆగస్టు 15 వేడుకల్లో పాటపాడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్!
- అమెరికా పౌర హక్కుల ఉద్యమం పాట
- హమ్ హోంగే కామ్యాబ్.. పాటపాడిన సీఎం
- హిందీలోకి అనువదించిన ప్రముఖ కవి గిరిజ కుమార్
కేజ్రీవాల్‌కు పాటలు పాడడం ఇదేమీ కొత్తకాదు. 2013లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కూడా ఓ పాట పాడారు. ఆ తర్వాత 1964లో వచ్చిన ‘దూర్ గగన్ కీ చావోన్ మైన్’ సినిమాలోని ‘ఆ చల్ కే తుజే మైన్ లేకే చలూన్’ పాటను ఆమధ్య కేజ్రీవాల్ పాడగా సోషల్ మీడియాలో అది విపరీతంగా వైరల్ అయింది. తాజాగా కేజ్రీవాల్ పాడిన ‘హమ్ హోంగే కామ్యాబ్’ అనేది అమెరికా పౌరహక్కుల ఉద్యమ గీతం. దీనిని ప్రముఖ కవి గిరిజ కుమార్ మాథుర్ హిందీలోకి అనువదించారు.