రాష్ట్రానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది: సీఎం కేసీఆర్
- రాష్ట్ర వ్యాప్తంగా ‘కంటి వెలుగు’ను అందిస్తున్నాం
- ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుంది
కంటి వైద్య పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 825 బృందాలను నియమించామని, 3 కోట్ల 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలను కూడా ప్రభుత్వమే చేయిస్తుందని చెప్పారు. కంటి వైద్యం కోసం ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ప్రతి గ్రామంలో ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ‘కాటరాక్ట్ ఆపరేషన్ అంటే నేను కూడా మొదట్లో భయపడేవాడిని, నా రెండు కళ్లకు ఈ ఆపరేషన్ చేయించుకున్నా’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.