జలవిలయంతో అల్లాడుతున్న కేరళ.. ఓనం వేడుకలు రద్దు!
- కేరళను అతలాకుతలం చేసిన వరదలు
- ఓనం వేడుకలను రద్దు చేసిన ప్రభుత్వం
- గతంలో కేటాయించిన రూ. 30 కోట్లు సీఎం సహాయనిధికి మళ్లింపు
కేరళ వత్సరాదిగా చెప్పే ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.30 కోట్లు కేటాయించింది. అయితే, రాష్ట్రాన్ని ఇటీవల వరదలు ముంచెత్తాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీంతో ఈ ఏడాది ఉత్సవాలను నిర్వహించుకోబోవడం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.