గాంధీ చేతిలో కర్రకు బదులు చీపురు పెట్టండి: మోదీ
- గతేడాది ఢిల్లీలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రారంభం
- తొలుత మోదీ విగ్రహం పెడతామన్న నిర్వాహకులు
- చీపురు పట్టుకున్న గాంధీ విగ్రహాన్ని పెట్టాలని సూచన
ప్రధాని చేసిన ఈ సూచనకు సంబంధించిన వీడియోను టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు షేర్ చేశారు. గతేడాది డిసెంబరులో ఢిల్లీలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. అందులో తొలుత మోదీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్వాహకులు భావించి ఆయనను కలిశారు. అయితే, తన విగ్రహానికి బదులుగా తొలుత గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అది కూడా చేతిలో చీపురు పట్టుకునేలా ఉండాలని ప్రధాని సూచించారు. కావాలంటే గాంధీ చీపురు పట్టుకున్నట్టున్న ఫొటోను తాను పంపిస్తానని వారితో చెప్పారట. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మ్యూజియం నిర్వాహకులు ఈ వీడియోను షేర్ చేశారు.