ఆ డైరెక్టర్ కి ఒక నమస్కారం పెట్టేశాను: శివశంకర్ మాస్టర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ డైరెక్టర్ కి ఒక నమస్కారం పెట్టేశాను: శివశంకర్ మాస్టర్

  • ఆ దర్శకుడు సెట్లో నిద్రపోతాడు 
  • లొకేషన్ బాగోలేదని తిప్పుతాడు 
  • టైమంతా వేస్ట్ చేస్తాడు
10 భాషల్లో .. 15 వేలకి పైగా పాటలకి శివశంకర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. అలాంటి శివశంకర్ మాస్టర్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా అనేక విషయాలను పంచుకున్నారు. "ఒక దర్శకుడితో కలిసి ఎనిమిది సినిమాలకి పని చేసిన తరువాత అదే దర్శకుడితో మీకు గొడవ వచ్చింది .. కారణం ఏమిటి?" అనే ప్రశ్న శివశంకర్ మాస్టర్ కి ఎదురైంది.

అప్పుడు ఆయన స్పందిస్తూ .. "నిజానికి నేను ఎప్పుడూ ఎవరితోనూ గొడవపెట్టుకుంది లేదు. ఒక డైరెక్టర్ వున్నారు .. ఆయన సినిమాలకి నేను వరుసగా పనిచేశాను. ఆయన రాత్రివేళల్లో నిద్రపోతాడో లేదో తెలియదు .. షూటింగులో వుండగా నిద్రపోతుంటారు. నేను రిహార్సల్స్ పూర్తి చేసేసి .. టేక్ అని గట్టిగా అరిస్తే .. ఆయన ఉలిక్కిపడి లేచేవారు. 'ఈ లొకేషన్ అంత బాగోలేదు .. అక్కడ చూద్దామా' అంటూ రెండు మూడు చోట్లకి తిప్పేసి, మళ్లీ ఫస్టు టైమ్ కెమెరా పెట్టిన లొకేషన్ కే తీసుకొచ్చేవారు. అట్లా టైమ్ వేస్ట్ చేసి .. 'ఇంకా కాలేదా' అని నన్నే దొబ్బులు పెట్టేవారు. నేను చూసి చూసి అలసిపోయి .. అయ్యా మీకో నమస్కారం .. దయచేసి ఇక నన్ను పిలవొద్దు .. నేను చెయ్యను' అని చెప్పేశాను" అని అన్నారు.      
shivashankar
ali

More Telugu News