Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవికి చిరు కోపం వుంది: నటుడు నారాయణరావు

  • చిరంజీవి చాలా హార్డ్ వర్కర్ 
  • ఆయనకి అంకితభావం ఎక్కువ  
  • బిగ్ టార్గెట్స్ తో ముందుకెళుతూ వచ్చాడు  
నటుడిగా నారాయణరావు సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చిరంజీవిని గురించి ప్రస్తావించారు. "నేను .. చిరంజీవి .. హరిప్రసాద్ .. సుధాకర్ .. ప్రసాద్ బాబు మంచి స్నేహితులం. రోజులో 12 గంటల పాటు మేమంతా కలిసే ఉండేవాళ్లం. ఒక గ్యాంగ్ మాదిరిగా కలిసి తిరుగుతూ ఉండేవాళ్లం.

ఆ మధ్య హరిప్రసాద్ చనిపోయాడు .. సుధాకర్ అనారోగ్యంతో బాధపడి ఈ మధ్యనే కోలుకుని మళ్లీ నటిస్తున్నాడు. ఇక ప్రసాద్ బాబు బిజీగానే వున్నాడు. మా నలుగురిలో చిరంజీవి బాగా పైస్థాయికి వెళ్లాడు. చిరంజీవి చాలా హార్డ్ వర్క్ చేశాడు .. అంకితభావం చాలా ఎక్కువ. మొదటి నుంచి కూడా బిగ్ టార్గెట్స్ తోనే ముందుకు వెళ్లేవాడు .. ఆయనలో నాకు నచ్చేవి ఇవే. ఇక చిరంజీవిలో చిరు కోపం కూడా వుంది .. అది కాస్త తగ్గించుకుంటే బాగుంటుందని ఒక స్నేహితుడిగా నేను భావిస్తూ వుంటాను" అని ఆయన చెప్పుకొచ్చారు.  
narayana rao
chiranjeevi

More Telugu News