తాజా షెడ్యూల్ కి రెడీ అవుతోన్న చరణ్
- బోయపాటితో సెట్స్ పై చరణ్
- కథానాయికగా కైరా అద్వాని
- త్వరలోనే ఫస్టులుక్ వదిలే ఛాన్స్
ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కావడం వలన, ఈ లోగా టైటిల్ ను ఖరారు చేసుకుని ఆ రోజున ఫస్టులుక్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చరణ్ కి మాస్ హీరోగా మంచి క్రేజ్ వుంది .. ఇక బోయపాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమా పట్ల అందరిలోనూ ఆసక్తి వుంది.