Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆర్ఎక్స్ 100' తమిళ రీమేక్ లో ఆది పినిశెట్టి!

  • ప్రకటించిన అవురా సినిమాస్ సంస్థ
  • అక్టోబర్ మూడోవారంలో షూటింగ్ మొదలవుతుందని వెల్లడి
  • త్వరలోనే డైరెక్టర్, హీరోయిన్ ఎంపిక
తెలుగులో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరో పాత్రకు 'రంగస్థలం' ఫేమ్ ఆది పినిశెట్టిని 'అవురా సినిమాస్' సంస్థ ఎంపిక చేసింది.

మిరుగం, ఈరం, మరకదనానయం వంటి తమిళ చిత్రాల్లో నటించిన ఆదికి అక్కడ మంచి మార్కెట్ ఉంది. దీంతో ఆదిని హీరో పాత్రకు ఎంపిక చేశారు. తమిళ వెర్షన్ లో డైరెక్టర్ తో పాటు హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదని 'అవురా సినిమాస్' ప్రతినిధి మహేశ్ తెలిపాడు. అక్టోబర్ మూడోవారంలో సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తామని వెల్లడించాడు. ప్రస్తుతం ఆది ‘యూటర్న్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఆర్ఎక్స్ 100 తమిళ రీమేక్ లో తాను నటిస్తున్నట్లు ఆది ధ్రువీకరించాడు.
RX100
tamil
aadi
remake

More Telugu News