'మహానటి'కి దక్కిన మరో పురస్కారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహానటి'కి దక్కిన మరో పురస్కారం!

  • భారీ విజయాన్ని సాధించిన 'మహానటి'
  • కీర్తి సురేశ్ కి ప్రముఖుల ప్రశంసలు 
  • తమిళంలో వరుస సినిమాలు
తెలుగు.. తమిళ భాషల్లో సావిత్రికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వున్నాయి. ఆమె బయోపిక్ ను 'మహానటి' పేరుతో నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేశ్ ఎంతోమంది ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా కీర్తి సురేశ్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది.ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరుగుతోన్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐఐఎఫ్ ఎమ్ 18) అవార్డు వేడుకల్లో, 'మహానటి' సినిమాకి గాను పురస్కారం లభించింది. నిన్న సాయంత్రం ఈ సినిమా టీమ్ ఈ పురస్కారాన్ని అందుకుంది. అవార్డుల వేడుక అనంతరం కీర్తి సురేశ్ .. నాగ్ అశ్విన్ .. స్వప్న దత్ .. ప్రియాంక దత్ .. తరుణ్ ఆదర్శ్ కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. తమిళంలో విక్రమ్ .. విశాల్ .. శివకార్తికేయన్ తో సినిమాలు చేస్తోన్న కీర్తి సురేశ్, తెలుగు కథలను వినడంలో బిజీగా వుంది. 
keerthi suresh
samanta
vijay devarakonda

More Telugu News