పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఏకంగా సీక్రెట్ ఏజెన్సీ ఆఫీసులో దూరాడు!: ఫ్రాన్స్ లో ఫన్నీ ఘటన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఏకంగా సీక్రెట్ ఏజెన్సీ ఆఫీసులో దూరాడు!: ఫ్రాన్స్ లో ఫన్నీ ఘటన

  • కారుతో మరో వాహనాన్ని ఢీకొట్టిన వ్యక్తి
  • లైసెన్స్ లేకపోవడంతో కారుతో జంప్
  • పోలీసుల నుంచి తప్పించుకోబోయి సీక్రెట్ సర్వీస్ చేతుల్లోకి
పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా వెళ్లి సీక్రెట్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ లోకి దూరిన ఫన్నీ ఘటన ఫ్రాన్స్ లో చోటుచేసుకుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఓ వ్యక్తి లైసెన్స్ లేకుండా రోడ్డుపైకి దూసుకొచ్చాడు. ఇంతవరకూ బాగానే ఉంది. అంతలోనే మరో వాహనాన్ని తన కారుతో ఢీకొట్టాడు. దీంతో పోలీసులు వెంబడించడంతో వారికి దొరక్కుండా వేగంతో కారును పరుగెత్తించాడు.

చివరికి కారును ఓ చోట ఆపేసి ఫెన్సింగ్ ఉన్న ఎత్తైన గోడను దూకేసి హమ్మయ్యా..! అనుకున్నాడు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఎందుకంటే అతను దూకింది అలాంటి ఇలాంటి భవనంలో కాదు.. సాక్షాత్తూ ఫ్రాన్స్ సీక్రెట్ సర్వీస్ ప్రధాన కార్యాలయంలో. అత్యంత భద్రత ఉండే జనరల్ డైరెక్టొరేట్ ఆఫ్ ఎక్స్ టర్నల్ సెక్యూరిటీ(జీడీఈఎస్) కార్యాలయంలోకి దూరాడు. దీంతో వెంటనే అతడిని చుట్టుముట్టిన పోలీసులు.. అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు
france
Police
GDES

More Telugu News