తన తండ్రి శాకాహారిగా మారిన కారణాన్ని చెప్పిన కనిమోళి!
- పెంపుడు కుక్క మరణంతో మారిన కరుణానిధి
- ఇంటి వెనుకే కుక్క మృతదేహం ఖననం
- ఆపై ఎన్నడూ మాంసాహారం ముట్టని కరుణ
ఆయన తన ఇంట్లో ఓ నల్లటి కుక్కను పెంచుకునేవారని, ఇంట్లో ఉన్నంతసేపూ అది వెన్నంటే ఉండేదని చెప్పిన కనిమోళి, తాను ఏది తింటే, దాన్నే కుక్కకు కూడా పెట్టేవారని చెప్పారు. ఆ కుక్కంటే తన తండ్రికి ఎంతో ఇష్టమని, అది మరణించిన తరువాత, మాంసాహారాన్ని మానేశారని చెప్పారు. కుక్క మృతదేహాన్ని తమ ఇంటి వెనకున్న ఖాళీ స్థలంలోనే ఖననం చేసి, అక్కడ ఓ మొక్కను ఆయన నాటారని, ఇప్పుడది పెద్ద చెట్టుగా ఎదిగిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు కనిమోళి.