ఎన్టీఆర్, ప్రభాస్ లకు తలసాని గ్రీన్ ఛాలెంజ్!
- ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి
- దర్శకుడు త్రివిక్రమ్, టీటీడీ చైర్మన్ సుధాకర్ కూ ఛాలెంజ్
- మానవాళి కోసం మొక్కలు నాటాలని పిలుపు
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటామని తెలిపారు. మానవాళి మనుగడ కోసం ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని తలసాని వ్యాఖ్యానించారు.