బాలకృష్ణతో వినాయక్ మూవీ ఖరారైపోయింది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలకృష్ణతో వినాయక్ మూవీ ఖరారైపోయింది

  • బాలకృష్ణతో సినిమా ఉంటుంది 
  • నిర్మాతగా సి.కల్యాణ్ వ్యవహరిస్తారు
  • స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా వచ్చింది    
బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ నిర్మాణంలో వినాయక్ ఒక సినిమా చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే కథ విషయంలో బాలకృష్ణ పూర్తిస్థాయి సంతృప్తిని వ్యక్తం చేయకపోవడంతో, వినాయక్ ఆ కథపై కసరత్తులు చేస్తూనే వున్నాడు. ఈ లోగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ ను మొదలెట్టేశారు. దాంతో ఇక బాలకృష్ణతో వినాయక్ మూవీ లేనట్టేనని అంతా అనుకున్నారు.

కానీ తమ కాంబినేషన్లో సినిమా ఉందని తాజాగా వినాయక్ చెప్పాడు. "బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయనున్నాను .. ఈ ప్రాజెక్టుకి నిర్మాతగా సి.కల్యాణ్ వ్యవహరిస్తారు. స్క్రిప్ట్ పెర్ఫెక్ట్ గా ఉండటం కోసం ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంతా సిద్ధంగా వుంది" అన్నాడు. దాంతో బాలకృష్ణతో వినాయక్ మూవీ ఉండటం ఖాయమని తెలుస్తోంది. 'ఎన్టీఆర్' బయోపిక్ తరువాత బాలకృష్ణ .. బోయపాటితో సెట్స్ పైకి వెళతాడో .. వినాయక్ తో కలిసి రంగంలోకి దిగుతాడో చూడాలి.  
balakrishna
vinayak

More Telugu News