టీఆర్ఎస్కు కేంద్రం షాక్.. కాళేశ్వరానికి జాతీయ హోదా కుదరదన్న గడ్కరీ!
- విభజన చట్టంలో ఉంది కాబట్టే పోలవరానికి జాతీయ హోదా
- భవిష్యత్తులో మరి దేనికీ ఇచ్చేది లేదన్న గడ్కరీ
- టీఆర్ఎస్ ఎంపీల నిరసన
లోక్సభలో మాట్లాడే అవకాశం రాకపోవడంతో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ గడ్కరీకి లేఖ రాస్తూ ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్లుగా చేస్తున్న అభ్యర్థనను విస్మరించొద్దని విజ్ఞప్తి చేశారు. ఏ విభజన చట్టాన్ని చూపెట్టి పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారో, అదే చట్టంలో కాళేశ్వరం గురించి కూాడా ప్రస్తావించారని పేర్కొన్నారు. కాబట్టి జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.