Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సిల్లీ ఫెలోస్' రిలీజ్ డేట్ ఖరారు

  • 'సిల్లీ ఫెలోస్'గా సునీల్, అల్లరి నరేశ్ 
  • సెప్టెంబర్ 7వ తేదీన విడుదల 
  • హాస్యమే ప్రధానంగా సాగే కథ
హాస్యభరిత చిత్రాల కథానాయకుడిగా అల్లరి నరేశ్ కి మంచి క్రేజ్ వుంది. కెరియర్ ను ఆరంభించిన దగ్గర నుంచి ఆయన చాలా వేగంగా సినిమాలు చేస్తూ వచ్చాడు. అలాంటి నరేశ్ ను సక్సెస్ పలకరించి చాలాకాలమే అయింది. ఇక సునీల్ పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే వుంది. ఆరంభంలో హీరోగా కొన్ని సక్సెస్ లు అందుకున్నా, ఆ తరువాత పరాజయాలతో డీలాపడిపోయాడు.

అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు 'సిల్లీ ఫెలోస్' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తికావడంతో, ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగారు. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తాజాగా దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా సక్సెస్ కావడం ఇటు సునీల్ కి .. అటు అల్లరి నరేశ్ కూడా చాలా అవసరం. ఇప్పటికే సునీల్ మళ్లీ కమెడియన్ గాను బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 
allari naresh
sunil

More Telugu News