షాహిద్ కపూర్ భార్యను ఆటపట్టించిన నెటిజన్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షాహిద్ కపూర్ భార్యను ఆటపట్టించిన నెటిజన్లు!

• యాంటీ ఏజింగ్ క్రీమ్ యాడ్ లో నటించిన మీరా
• మండిపడుతున్న నెటిజన్లు
• గతంలో తాను ఇలాంటివి వాడనని చెప్పిన వైనం
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నువ్వొకటి పాటిస్తూ ప్రజల్ని ఇంకొకటి చేయమని చెబుతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే 'మిమ్మల్ని చూసి సిగ్గు పడుతున్నాం' అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. అసలు దీనంతటికీ కారణం మీరా ఓ వాణిజ్య ప్రకటనలో నటించడమే.

తాను చర్మ సౌందర్యం కోసం సహజసిద్ధమైన ఉత్పత్తులే వాడతానని మీరా గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. తాజాగా ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలో ఓలే కంపెనీ మీరాతో యాంటీ ఏజింగ్ క్రిమ్ కు సంబంధించి ఓ యాడ్ ను షూట్ చేసింది. ‘తల్లిగా మారినంత మాత్రాన మీకు మీరుగా ఉండే హక్కును కోల్పోయినట్లు కాదు.. ఇదిగో నా రీబోర్న్ స్టోరీ’ అంటున్న యాడ్ ను మీరా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

దీంతో కేవలం సహజ ఉత్పత్తులే వాడతానని గతంలో చెప్పి, ఇప్పుడు యాంటీ ఏజింగ్ క్రీమ్ ను వాడమని యాడ్లు చేస్తావా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘23 ఏళ్లకే ఏజింగ్ క్రీములు వాడటం ఏంటి, నాన్సెన్స్’ అని మరికొందరు విమర్శించారు. ఇంకొందరు అభిమానులైతే..‘ఇలాంటి ఉత్పత్తులకు ప్రచారం నిర్వహించి మీ స్థాయిని తగ్గించుకోకండి’ అంటూ సుతిమెత్తగా హెచ్చరించారు.

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2018-08-06T19:11:22+00:00">Aug 6, 2018 at 12:11pm PDT</time>

mira rajput
anti aging cream
advertisment
shahid kapoor

More Telugu News