భారీ పోరాట సన్నివేశాల చిత్రీకరణలో 'సైరా'
- ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు
- టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్
- వచ్చే వేసవిలో సినిమా రిలీజ్
హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో డిజైన్ చేయబడిన పోరాట సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని చెబుతున్నారు. తదుపరి షెడ్యూల్ ను యూరప్ లో చిత్రీకరించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇక ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కావడంతో, అభిమానులలో ఉత్సాహాన్ని నింపడం కోసం టీజర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ వున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.