కొనసాగుతున్న కరుణానిధి అంతిమయాత్ర

  • కాసేపట్లో మెరీనా బీచ్ కు చేరుకోనున్న అంతిమయాత్ర
  • కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన ప్రజలు
  • ‘మెరీనా’కు చేరుకున్న పలువురు ప్రముఖులు
డీఎంకే అధినేత కరుణానిధి అంతిమయాత్ర కొనసాగుతోంది. రాజాజీ హాల్ నుంచి వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం, శివానంద రోడ్, తంతైపెరియార్ రోడ్డు మీదుగా కాసేపట్లో మెరీనా బీచ్ కు చేరుకోనుంది. డీఎంకే శ్రేణులు, అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. కరుణానిధికి కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ నేత గులాంనబీ ఆజాద్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, వివిధ పార్టీల నేతలు మెరీనా బీచ్ కు చేరుకున్నారు.
Go Back to Shorts
karunanidh
merina beach

More Telugu News