మీ పిల్లలు అదే పనిగా ఫోన్ పట్టుకుంటున్నారా? అయితే ఇది మీకు హెచ్చరికే!
- స్క్రీన్కు అతుక్కుపోయే వారిలో ‘డిజిటల్ ఐ స్ట్రెయిన్’
- కళ్లు ఎండిపోయి జీవం కోల్పోయే ప్రమాదం
- తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పరిశోధకుల హెచ్చరిక
1971 నుంచి ప్రపంచవ్యాప్తంగా హ్రస్వదృష్టి అంటువ్యాధిలా విస్తరిస్తోంది. 42 శాతం మంది అమెరికన్లు దీనితో బాధపడుతున్నారు. ఆసియా వ్యాప్తంగా 90 శాతం మంది టీనేజర్లు, పెద్దలు హ్రస్వదృష్టితో బాధపడుతున్నారు. అయితే, ఇన్నాళ్లూ దీనికి కారణం ఏంటనేది పరిశోధకులు కూడా చెప్పలేకపోయారు. తాజాగా జరిగిన అధ్యయనం ద్వారా ఈ విషయంపై స్పష్ట వచ్చింది. కంప్యూటర్, ఫోన్ల స్క్రీన్ లైటింగే దృష్టి లోపానికి కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు. దీనివల్ల కళ్లు ‘డిజిటల్ ఐ స్ట్రెయిన్’కు గురవుతాయని పేర్కొన్నారు. డిజిటల్ ఐ స్ట్రెయిన్ వల్ల కళ్లు ఎండిపోవడం, తలనొప్పి, చూపులో స్పష్టత లేకపోవడం, కళ్లపై ఒత్తిడి వంటివి బాధిస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు ఆఫ్తామాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి.