Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జయశంకర్ సార్ జీవితం మనందరికీ స్ఫూర్తి దాయకం: ఎంపీ కవిత

  • ఉద్యమ సమయంలో పలు పరిస్థితులు ఎదుర్కొన్నాం
  • నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు
  • అందుకు జయశంకర్ సార్ జీవితమే నిదర్శనం
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జీవితం మనందరికీ స్ఫూర్తి దాయకమని ఎంపీ కవిత అన్నారు. ఈరోజు జయశంకర్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు.

అనంతరం జరిగిన సభలో కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో రకరకాల పరిస్థితులను తాము ఎదుర్కొన్నామని, వాటిని అధిగమించేందుకు జయశంకర్ సార్ వద్ద కూర్చొని చర్చించిన సంగతులను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తున్న సమయంలో ఆయన లేకపోవడం బాధాకరమని అన్నారు. నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పేందుకు జయశంకర్ సార్ జీవితమే మనకు నిదర్శనమని కొనియాడారు.   
mp kavitha
New Delhi
Telangana bhavan

More Telugu News