తిరుమలలో సాక్షాత్కారం కానున్న అరుదైన దృశ్యం... ఈ నెలలో రెండు గరుడ సేవలు!
- 16న గరుడ పంచమి, 26న శ్రావణ పౌర్ణమి
- రెండు సార్లు గరుడిపై ఊరేగనున్న మలయప్ప స్వామి
- ఏర్పాట్లు చేస్తున్నామన్న టీటీడీ
గరుడ పంచమి నాడు సాయంత్రం 5 నుంచి 6.30 గంటల మధ్య, ఆపై శ్రావణ పౌర్ణమి నాడు రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య గరుడవాహన సేవను నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు ఎటువంటి లోటు రానీయకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్టు పేర్కొన్నారు.