43 భాషలు, 900 ఫొటోలు వాడుతూ మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్!

  • 9న మహేష్ బాబు పుట్టిన రోజు
  • పోస్టర్ ను తయారు చేసిన వీరాభిమాని
  • వైరల్ అవుతున్న పోస్టు
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు మరో మూడు రోజుల్లో... అంటే ఈనెల 9న రానుండగా, అభిమానులు వినూత్నంగా ఆలోచించి ఓ మంచి గిఫ్ట్ ను అందించారు. ప్రస్తుతం తన 25వ చిత్రంలో నటిస్తున్న మహేష్ కు 900 ఫొటోలు వాడుతూ తయారు చేసిన పోస్టర్ ను ఓ వీరాభిమాని తయారు చేశాడు. దీనిపై 43 అంతర్జాతీయ భాషల్లో 'హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్' అని రాయడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మహేష్ తాజా చిత్రం ఫస్ట్ లుక్ ను 9వ తేదీన విడుదల చేస్తారని భావిస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ తయారు చేసిన పోస్టర్ ను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Tollywood
Mahesh Babu
Birth day

More Telugu News