కోటు తీసేసి బిగ్‌బాస్ హౌస్ గోడెక్కిన నాని.. అందరూ సర్‌ప్రైజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోటు తీసేసి బిగ్‌బాస్ హౌస్ గోడెక్కిన నాని.. అందరూ సర్‌ప్రైజ్!

  • బిగ్‌బాస్‌లో నాని సాహసం
  • గోడ ఎక్కి ఫ్రెండ్‌షిప్ డే విషెస్
  • కిందికి దూకాలన్న హౌస్‌మేట్స్
టాలీవుడ్ హీరో నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్ 2’ షో ఉత్సాహంగా సాగుతోంది. ఇప్పటికే సగం భాగాన్ని ముగించుకున్న ఈ షో.. రోజురోజుకు ఆసక్తికరంగా, అనూహ్య మలుపులతో ఆకట్టుకుంటోంది. దీంతో ప్రేక్షకులు సైతం ఒక్కసారిగా పెరిగారు. పోటీదారులకు మద్దతుగా వస్తున్న ఓట్లను చూస్తుంటే ఈ విషయం అర్థం అవుతోంది. ఇక, హౌస్‌లో ప్రధాన పోటీదారుగా మారుతున్న కౌశల్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. అతడి పేరుతో కోకొల్లలుగా పేజీలు పుట్టుకొస్తున్నాయి.

కాగా, ఆదివారం బిగ్‌బాస్ పోటీదారులను నాని ఆశ్చర్యపరిచాడు. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత నానిని టీవీలో మాత్రమే చూస్తున్న పోటీదారులు నిన్న సడెన్‌గా ప్రత్యక్షంగా అతడిని చూసేసరికి కేరింతలు కొట్టారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి విషెస్ చెప్పేందుకు నాని ఏకంగా గోడ ఎక్కి మరీ విష్ చేశాడు. కోటు విప్పేసి గోడ ఎక్కి బిగ్‌బాస్ హౌస్ పైకి ఎక్కిన నాని అందరికీ ‘ప్రెండ్‌షిప్ డే’ విషెస్ చెప్పాడు. అతడిని చూసిన హౌస్‌మేట్స్ కిందికి దూకేయాలంటూ గొడవ చేశారు. అయితే, అలా రాకూడదని చెప్పిన నాని విషెస్ చెప్పిన అనంతరం వెళ్లిపోయి టీవీలో మాట్లాడాడు. 
BigBoss
Actor Nani
Tollywood
Starmaa

More Telugu News