ధోనీతో అమిత్ షా భేటీ.. మద్దతు కోరిన బీజేపీ అధ్యక్షుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీతో అమిత్ షా భేటీ.. మద్దతు కోరిన బీజేపీ అధ్యక్షుడు!

  • సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా ధోనీని కలిసిన అమిత్ షా
  • బీజేపీ విజయాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన బీజేపీ చీఫ్
  • రానున్న ఎన్నికల్లో మద్దతు పలకాలని విన్నపం
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ అయ్యారు. సంపర్క్ సే సమర్థన్ ప్రచార కార్యక్రమంలో భాగంలో ఆయన ఈ రోజు ఢిల్లీలో ధోనీని కలిశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను, అభివృద్ధి కార్యక్రమాలను ధోనీకి అమిత్ షా వివరించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలకాలని కోరారు.

2019 ఎన్నికల నేపథ్యంలో సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిన సంగతి తెలిసిందే. మే 29న ఈ కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లోని ప్రముఖులను వ్యక్తిగతంగా కలుస్తూ... వారి మద్దతును బీజేపీ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే లతా మంగేష్కర్, కపిల్ దేవ్, రతన్ టాటా, మాధురీ దీక్షిత్ తదితరులను అమిత్ షా కలిశారు.
MS Dhoni
amit shah

More Telugu News