నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన చంద్రబాబు

  • బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బొడ్డు వేణుగోపాల్
  • విత్తనాభివృద్ధి ఛైర్మన్ గా ఏవీ సుబ్బారెడ్డి
  • మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా వేదవ్యాస్
ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు భర్తీ చేశారు. ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బొడ్డు వేణుగోపాల్ (కృష్ణా జిల్లా)ను నియమించారు. ఏపీ ఖాదీ, గ్రామీణ బోర్డు ఛైర్మన్ గా దొమ్మేటి సుధాకర్ (పశ్చిమగోదావరి), ఏపీ విత్తనాభివృద్ధి ఛైర్మన్ గా ఏవీ సుబ్బారెడ్డి (కర్నూలు), అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి బోర్డు ఛైర్మన్ గా కాకి గోవిందరెడ్డి (విశాఖపట్నం), నూర్ బాషా-దూదేకుల ముస్లిం కార్పొరేషన్ సొసైటీ ఫెడరేషన్ ఛైర్మన్ గా బబన్ (కర్నూలు), మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా బూరగడ్డ వేదవ్యాస్ లను నియమించారు. ఈ సందర్బంగా ఏవీ సుబ్బారెడ్డికి నామినేటెడ్ పదవి ఇస్తానంటూ నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు.
Go Back to Shorts
Chandrababu
nominated posts

More Telugu News