నా సోదరుల కెరీర్ దెబ్బతినడానికి నేనే కారణం!: సల్మాన్ ఖాన్
- నా స్టార్ డమ్ తో నా సోదరుల స్టార్ డమ్ ను పోల్చేవారు
- నాతో సమానంగా వారి సినిమాలు ఆడవనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చారు
- వారికి అవకాశాలు ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదు
దీనిపై సల్మాన్ మాట్లాడుతూ, తన స్టార్ డమ్ తో అర్భాజ్, సొహైల్ ల స్టార్ డమ్ ను దర్శకనిర్మాతలు పోల్చేవారని చెప్పాడు. తన సినిమాలతో సమానంగా తన సోదరుల సినిమాలు ఆడవనే నిర్ణయానికి వచ్చిన దర్శకనిర్మాతలు... వారికి అవకాశాలను ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదని చెప్పాడు. ఈ రకంగా వారి కెరీర్ దెబ్బతినడానికి తానే కారణమని తెలిపాడు.
మరోవైపు హీరోగా విఫలమైన అర్భాజ్ దర్శకుడుగా, నిర్మాతగా మాత్రం రాణించాడు. ఆయన నిర్మించిన 'దబాంగ్', దాని సీక్వెల్ లు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో సల్మానే హీరోగా నటించాడు.