Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రం వరకు చంద్రబాబు గొప్ప నేత: బీజేపీ ఎంపీ గంగరాజు

  • జాతీయ నేత కావాలంటే గొప్పతనాన్ని నిరూపించుకోవాలి
  • దేశానికి, ప్రపంచానికి గొప్ప నేత మోదీ
  • రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో చంద్రబాబు చెప్పాలి
ఆంధ్రప్రదేశ్ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప నేత అని బీజేపీ ఎంపీ గంగరాజు అన్నారు. దేశానికి, ప్రపంచానికి గొప్ప నేత ప్రధాని మోదీ అని చెప్పారు. జాతీయ నేత కావాలంటే గొప్పతనాన్ని నిరూపించుకోవాలని తెలిపారు. విభజన తర్వాత కట్టుబట్టలతో వచ్చామని చంద్రబాబు చెప్పారని... 2014 నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి నిధులు లేకుండా గ్రామాల్లో ఏం చేశారో చెప్పాలని అడిగారు. కేంద్రం నుంచి సాయాన్ని పొంది, దాన్ని మర్చిపోతే... విశ్వాసఘాతుకం అవుతుందని చెప్పారు. అన్ని విషయాలకు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మానుకోవాలని హితవు పలికారు.
Chandrababu
gangaraju
modi

More Telugu News