మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో రకుల్?
- సూర్య హీరోగా సెట్స్ పై 'ఎన్ జీకే'
- హీరో భార్య పాత్రలో సాయిపల్లవి
- 'ఎమ్ జీఆర్' జీవిత చరిత్ర ఆధారంగా నిర్మాణం
ఈ సినిమాలో సూర్య భార్య పాత్రలో సాయిపల్లవి నటిస్తుండగా .. ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం రకుల్ ప్రీత్ ను తీసుకున్నారు. అయితే ఈ సినిమా 'ఎమ్ జీఆర్' జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నారనే టాక్ తాజాగా కోలీవుడ్లో షికారు చేస్తోంది. రకుల్ పోషించేది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలోనేనని అనుకుంటున్నారు. విషయం ముందుగానే బయటికి వస్తే ఆటంకాలు ఏర్పడతాయనే ఉద్దేశంతోనే గుంభనంగా ఉంచారని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి. ఏదేమైనా ఒక వైపున శ్రీదేవి పాత్ర కోసం .. మరో వైపున జయలలిత పాత్ర కోసం రకుల్ పేరు వినిపిస్తూ ఉండటం విశేషం.