బాలయ్యతో బోయపాటి మూవీ బడ్జెట్ 100 కోట్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలయ్యతో బోయపాటి మూవీ బడ్జెట్ 100 కోట్లు!

  • బాలకృష్ణకి లైన్ వినిపించిన బోయపాటి 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలకృష్ణ 
  • గతంలో భారీ హిట్స్ కొట్టిన కాంబినేషన్
బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టుగా కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. హిట్ కాంబినేషన్ కావడంతో అందరూ ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ఇటీవలే బాలకృష్ణను బోయపాటి కలిసి ఒక లైన్ వినిపించడం .. బాలకృష్ణ ఓకే చెప్పేయడం జరిగిపోయాయి. ఎప్పటి మాదిరిగానే ఈ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేశారు. ఈ సినిమాను కూడా తన బ్యానర్లోనే బాలకృష్ణ చేయనున్నారు.

కథ ప్రకారం బడ్జెట్ 100 కోట్ల వరకూ వుండచ్చని బాలకృష్ణకి బోయపాటి చెప్పాడట. అందుకు బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ ను 80 కోట్ల బడ్జెట్ తో చేస్తున్నారు. ఆ తరువాత ఆయన బోయపాటితో చేయనున్న సినిమాకి 100 కోట్లు పెట్టనున్నారు. బాలకృష్ణ కెరియర్లోనే ఈ స్థాయి బడ్జెట్ తో నిర్మిస్తోన్న సినిమా ఇదేనని అంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ జోడీకట్టే భామలెవరో చూడాలి.       
balakrishna
Boyapati Sreenu

More Telugu News