Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేనేమీ తప్పు చేయలేదు: నటి అదా శర్మ

  • కికి చాలెంజ్ స్వీకరించిన అదా శర్మ
  • వెల్లువెత్తిన విమర్శలు
  • ఆగివున్న కారేనన్న అదా శర్మ
కికి చాలెంజ్ చేసిన నటి అదా శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆమె స్పందించింది. తానేమీ కదులుతున్న కారు నుంచి దిగి డ్యాన్స్ చేసి, తిరిగి కారెక్కలేదని గుర్తు చేసింది. తానేమీ తప్పు చేయలేదని, ఆగి ఉన్న కారు నుంచి దిగి డ్యాన్స్ చేశానని చెప్పింది. తాను ఆ సమయంలో షూటింగ్ లో ఉన్నానని, కాస్తంత గ్యాప్ రావడంతో అప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ తోనే డాన్స్ వేశానే తప్ప, కదులుతున్న కారు నుంచి తాను దూకలేదని చెప్పింది. తాను రూల్స్ ను, చట్టాన్ని అతిక్రమించలేదనే అనుకుంటున్నానని, ప్రభుత్వం, పోలీసులు ఈ విషయాన్ని గుర్తించే ఉంటారని భావిస్తున్నట్టు చెప్పింది.
Kiki
Adhasharma
car
Challenge

More Telugu News