mp ds: డీఎస్ కుమారుడు సంజయ్ పై ‘నిర్భయ’ చట్టం కింద కేసు నమోదు!

షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు డి.శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్ పై నిర్భయ చట్టం కింద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. సంజయ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నిజామాబాద్ లోని ఆయన సొంత కళాశాల ‘శాంకరి’కి చెందిన నర్సింగ్ విద్యార్థినులు నిన్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

హోం మంత్రి సూచన మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) ను బాధిత విద్యార్థినులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదు మేరకు సంజయ్ పై కేసు నమోదు చేశారు. కాగా, సంజయ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లినట్టు సమాచారం. అయితే, సంజయ్ అక్కడ లేకపోవడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Go Back to Shorts
mp ds
sanjay
nirbhaya case

More Telugu News