adivi sesh: 'గూఢచారి'లో నాగ్ మేనకోడలు దుమ్మురేపేసిందట!

షార్ట్స్‌లో చూడండి
చాలాకాలం క్రితం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా ద్వారా నాగార్జున మేనకోడలు సుప్రియ పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి వసూళ్లనే సాధించినా, ఆ తరువాత ఆమె మరో సినిమా చేయలేదు. మళ్లీ ఇంతకాలానికి సుప్రియ .. 'గూఢచారి' సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించింది. రా ఆఫీసర్ నదియా ఖురేషి పాత్రలో సుప్రియ కనిపించింది.

ఈ సినిమాలో ఆమె గెస్టుగానే కనిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె పవర్ఫుల్ పాత్రలో సినిమా అంతా కనిపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంత గ్యాప్ తీసుకున్నా ఆమె చాలా సహజంగా .. అద్భుతంగా నటించిందని అంటున్నారు. తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి దుమ్మురేపేసిందని చెబుతున్నారు. ఇకపై నటిగా కొనసాగాలని ఆమె అనుకుంటే మాత్రం .. బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.    
Go Back to Shorts
adivi sesh
supriya

More Telugu News