Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను బతికుండేది ఏడాదో రెండేళ్లో!: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆవేదన

  • ఈ విషయం నా మెదడు నాకు నిత్యం చెబుతోంది
  • నాకు కీమో థెరపీ నాలుగు సైకిల్స్ చికిత్స పూర్తయింది
  • ఇంకా రెండు సైకిల్స్ పూర్తవ్వాలి.. ఆ తర్వాత స్కాన్ చేస్తారు 
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లండన్ లో ఆయన చికిత్స పొందుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ మాట్లాడుతూ, తాను బతికుండేది మరికొన్ని నెలలు మాత్రమేనంటూ ఆవేదనాభరితమైన వ్యాఖ్యలు చేశాడు.

'నేను బతికుండేది కొన్ని నెలలు.. లేదంటే ఏడాది, మహా అయితే రెండేళ్లు బతుకుతానేమో! ఈ విషయాన్ని నా మెదడు నాకు నిత్యం చెబుతోంది' అంటూ నిరుత్సాహంతో చెప్పాడు. అయితే, ఇకపై, ఇలాంటి మాటలు మాట్లాడనని.. తనకున్న జీవితాన్ని హ్యాపీగా అనుభవిస్తానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం తనకు కీమో థెరపీ నాలుగు సైకిల్స్ పూర్తయ్యాయని, ఇంకా రెండు సైకిల్స్ పూర్తి కావాల్సి ఉందని చెప్పాడు. తనకు మొత్తం ఆరు సైకిల్స్ పూర్తయ్యాక స్కాన్ చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఏం చేయాలనేది తెలుస్తుందని ఇర్ఫాన్ ఖాన్ చెప్పాడు.
irfankhan
tumor

More Telugu News