Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పారితోషికం తగ్గించుకున్న సునీల్?

  • హీరోగా పలకరించని విజయాలు 
  • మళ్లీ కామెడీ పాత్రలపై దృష్టి 
  • పారితోషికం విషయంలో మార్పులు  
హీరోగా వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటంతో, కమెడియన్ గా కూడా కంటిన్యూ చేయాలని సునీల్ నిర్ణయించుకున్నాడు. ఒక వైపున హీరోగా చేస్తూనే .. మరో వైపున పెద్ద సినిమాల్లో కమెడియన్ గా అలరించడానికి ఆయన రంగంలోకి దిగిపోయాడు. ఈ నేపథ్యంలోనే 'సిల్లీ ఫెలోస్' అనే సినిమాలో ఒక హీరోగా చేస్తున్నాడు. మరో హీరోగా అల్లరి నరేశ్ చేస్తోన్న ఈ సినిమాకి భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు.

 గతంలో హీరోగా 4 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకున్న సునీల్, ఈ సినిమా కోసం భారీగానే పారితోషికం తగ్గించుకున్నాడట. ఈ సినిమా కోసం కేవలం ఆయన కోటిన్నర పారితోషికమే తీసుకున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఇక శ్రీను వైట్ల 'అమర్ అక్బర్ ఆంటోని' .. త్రివిక్రమ్ 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలు పెద్దవి కావడంతో, కమెడియన్ గానే కోటి రూపాయల రెమ్యునరేషన్ ను తీసుకున్నాడని అంటున్నారు. 
sunil
allari naresh

More Telugu News