రాజశేఖర్ సినిమాకి నో చెప్పిన కాజల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజశేఖర్ సినిమాకి నో చెప్పిన కాజల్!

  • 'గరుడవేగ'తో హిట్ కొట్టిన రాజశేఖర్ 
  • 'అ!'తో సక్సెస్ సాధించిన ప్రశాంత్ వర్మ 
  • ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా
మొదటి నుంచి కూడా కాజల్ అగ్రకథానాయకులతోనే వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చినా ఆమె తన స్థాయికి తక్కువ పాత్రలను మాత్రం చేయలేదు. ఊహించని విధంగా మళ్లీ ఆమెకి అవకాశాలు పెరగడం .. సక్సెస్ లు పలకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా రాజశేఖర్ సినిమా కోసం ఆమెను అడిగారట. అయితే కాజల్ నుంచి నో అనే ఆన్సర్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

 'గరుడవేగ' సినిమా హిట్ తరువాత, మంచి కథ కోసం రాజశేఖర్ గ్యాప్ తీసుకున్నారు. 'అ!' వంటి ప్రయోగాత్మక చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న ప్రశాంత్ వర్మ, ఇటీవలే ఒక విభిన్నమైన కథను రాజశేఖర్ కి వినిపించాడట. తన బ్యానర్లో ఈ సినిమా చేయడానికి రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ని అడిగితే డేట్స్ లేవని చెప్పడంతో, శ్రియను ఓకే చేసినట్టుగా సమాచారం. సెప్టెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.  
kajal
shriya

More Telugu News