కశింకోటలో సందడి చేసిన రాజమౌళి, రమ!
- తల్లి పేరిట పాఠశాల భవన నిర్మాణం
- ప్రారంభించేందుకు వచ్చిన రాజమౌళి దంపతులు
- స్వాగతం పలికిన ఎమ్మెల్యే పీలా
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, పిల్లలకు ఆడుకునేందుకు మరింత సమయాన్ని కేటాయించాలని, తరగతి గదుల్లోకన్నా, మైదానంలో ఆడుకునే సమయంలోనే వారు ఎక్కువ నేర్చుకుంటారని అన్నారు. రాజమౌళి, రమా రాజమౌళి వస్తున్నారని తెలుసుకున్న కశింకోట ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని వారిని చూసేందుకు ఆసక్తి చూపారు.