యాదగిరిగుట్టలో వ్యభిచార దందా... మంచం కింద సొరంగం నుంచి నలుగురు బాలికలను రక్షించిన పోలీసులు!
- వరుసగా మూడో రోజూ తనిఖీలు
- మంచం కింద గోడను తొలుస్తూ నిర్మాణం
- మరిన్ని ఇళ్లలో ఇవే నిర్మాణాలు ఉండవచ్చని అనుమానం
పోలీసులు తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం తెలిస్తే, వారిని ఆ సొరంగంలోకి పంపిస్తారని, అందులో ఆరుగురు పట్టే వీలుందని, బయటకు ఎంతమాత్రమూ అనుమానం రాని విధంగా దాన్ని నిర్మించి, మంచాన్ని అడ్డు పెట్టారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పట్టణంలోని పాత నరసింహస్వామి దేవాలయానికి వెళ్లే దారిలోని మరిన్ని ఇళ్లలో ఇదే తరహా నిర్మాణాలు ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నాయని, మరింత విస్తృతంగా తనిఖీలు చేస్తామని చెప్పారు.