Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

1000 కోట్ల సినిమాకి మొదలైన సన్నాహాలు!

  • భారీ బడ్జెట్ తో బహు భాషా చిత్రం
  • రెండు భాగాలుగా నిర్మాణం
  • ఆయా భాషల నుంచి నటీనటులు 
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధానమైన పాత్రగా .. మహాభారతం కథావస్తువుగా ఒక సినిమాను నిర్మించనున్నారనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. బీఆర్ శెట్టి దీనిని 1000 కోట్ల బడ్జెట్ తో బహు భాషా చిత్రంగా నిర్మించనున్నారనే టాక్ రావడంతో సహజంగానే అందరి దృష్టి ఈ ప్రాజెక్టు వైపుకు మళ్లింది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను, ప్రముఖ రచయిత వాసుదేవ నాయర్ రాసిన 'రండా మూళమ్'అనే నవల ఆధారంగా రూపొందించనున్నారు.

మలయాళం వెర్షన్ కి ఇదే టైటిల్ ను ఉంచేసి, తెలుగు .. తమిళ .. హిందీ .. కన్నడ .. వెర్షన్స్ కి మాత్రం 'ది మహాభారత' అనే టైటిల్ పెడదామనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది. నటీనటులను కూడా ఆయా భాషల నుంచి ఎంపిక చేయనున్నట్టు సమాచారం. రెండు భాగాలు ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. వచ్చే జూలై నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. 2020లో మొదటి భాగాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. 
mohanlal

More Telugu News