టీడీపీకి పని తక్కువ.. ప్రచారం ఎక్కువ: విష్ణుకుమార్ రాజు

  • కేంద్రం చేసిన సాయం ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయాం
  • కాపు రిజర్వేషన్లనూ బాబు రాజకీయం చేస్తున్నారు
  • కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న విష్ణుకుమార్ రాజు
'టీడీపీకి పని తక్కువ.. ప్రచారం ఎక్కువ' అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం, విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాము విఫలమయ్యామని అన్నారు. కాపు రిజర్వేషన్లనూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

కాగా, ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఏపీలో బీజేపీ బలోపేతం గురించి చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్, సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. 
Go Back to Shorts
bjp
vishnu kumar raju
Vijayawada

More Telugu News