అప్పుడు నా భార్య ఒంటరిగా హనీమూన్ కు వెళ్లిపోయింది: అనిల్ కపూర్ మధుర జ్ఞాపకం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పుడు నా భార్య ఒంటరిగా హనీమూన్ కు వెళ్లిపోయింది: అనిల్ కపూర్ మధుర జ్ఞాపకం

  • పెళ్లికి ముందు విషయాలు పంచుకున్న అనిల్ కపూర్
  • హీరోగా తొలి చిత్రం తరువాత ప్రపోజ్
  • హనీమూన్ కు తాను వెళ్లలేకపోయానన్న అనిల్
తన 35 సంవత్సరాల వైవాహిక జీవితంలోని మధురమైన జ్ఞాపకాలను బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ గుర్తు చేసుకుంటున్నారు. భార్య సునీతా కపూర్ తో తన మధురస్మృతులను 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' కోసం ఫేస్ బుక్ లో పంచుకుంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. సునీతతో తన ప్రేమాయణం, మరో అమ్మాయి సాయంతో సునీతతో డేటింగ్, పెళ్లి గురించిన వివరాలు చెప్పారు.  

వివాహమైన కొత్తల్లో హనీమూన్ కు ప్లాన్ చేసుకున్నామని, తాను అత్యవసర షూటింగ్ నిమిత్తం ఉండిపోగా, తన భార్య సునీత ఒక్కతే హనీమూన్ కు వెళ్లిపోయిందని చెప్పాడు. తన తొలి హిట్ చిత్రం 'మేరీ జంగ్' తరువాతనే తనకో ఇల్లు దక్కిందని చెప్పారు. ఆ తరువాత వెంటనే సునీతకు ఫోన్ చేసి "రేపు పెళ్లి చేసుకుందాం. రేపే చేసుకోకుంటే మరెప్పటికీ జరగదు" అని చెప్పానని, ఆ మరుసటి రోజే తమ వివాహం జరిగిపోయిందని అన్నారు. వివాహం కాగానే 3 రోజుల పాటు తాను షూటింగ్ కు వెళితే, మేడమ్ విదేశాలకు హనీమూన్ కు వెళ్లిందని, తాను లేకుండానే ఆవిడ వెళ్లిపోయిందని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
Anil Kapoor
Humans of Bombay
Facebook
Sunita Kapoor

More Telugu News