ఆధార్ నంబర్ ఎవరికైనా వెల్లడించడం చట్ట వ్యతిరేకమే!: యూఐడీఏఐ
- ఆధార్ ను చట్టబద్ధంగా మాత్రమే వినియోగించాలి
- తనకు తానుగా బహిర్గతం చేయడం నేరమే
- ట్రాయ్ చైర్మన్ శర్మ ఉదంతం తరువాత కీలక వ్యాఖ్యలు
ఇటీవల ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ, తన ఆధార్ సంఖ్యను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, తన వివరాలు తెలుసుకోగలిగితే చెప్పాలని, ఆధార్ బహిర్గతమైతే కలిగే నష్టమేదైనా ఉంటే తెలియజేయాలని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఆపై నెటిజన్లు, హ్యాకర్లు శర్మ వ్యక్తిగత వివరాలను ఎన్నింటినో బహిర్గతం చేసి, ఆధార్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని తేల్చిన నేపథ్యంలో యూఐడీఏఐ ఈ ప్రకటన చేయడం గమనార్హం.