ఆ పాటలో రామారావుగారు నిజంగానే ఏడ్చేశారు: ముచ్చర్ల అరుణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ పాటలో రామారావుగారు నిజంగానే ఏడ్చేశారు: ముచ్చర్ల అరుణ

  • రామారావుగారితో 'జస్టిస్ చౌదరి' చేశాను 
  • ఆయనను నాన్నగారు అని పిలిచేదానిని 
  • ఆయనతో కలిసి నటించడం అదృష్టం  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ముచ్చర్ల అరుణ, ఎన్టీ రామారావుతో కలిసి చేసిన 'జస్టిస్ చౌదరి' సినిమాను గురించి ప్రస్తావించారు. "జస్టిస్ చౌదరి' సినిమాలో ఎన్టీ రామారావుగారి కూతురిగా .. మూగ అమ్మాయిగా చేశాను. ఈ సినిమాలో నాకు పెళ్లి చూపులు జరుగుతాయి. ఆ సందర్భంలోనే 'శ్రీలక్ష్మీ పెళ్లికి చిరునవ్వు కట్నం .. మా లక్ష్మి పెళ్లికి మమతే పేరంటం ..' అనే పాట వస్తుంది.

అది ఎంత మంచి సాంగ్ అంటే .. ఆ పాటలో ఎన్టీ రామారావుగారు నిజంగానే ఏడ్చేశారు .. నిజంగానే నేను కూడా ఏడ్చేశాను. ఆ పాటలోని అర్థం అలా వుంటుంది .. అందుకే అంతలా ఎమోషనల్ అయ్యాము. షూటింగు గ్యాప్ లో రామారావుగారు ఎంతో ఆత్మీయంగా వుండేవారు. నేను కూడా ఆయనని 'నాన్నగారు' అనే పిలిచే దానిని. నటన పట్ల ఎంతటి అంకితభావం కలిగి ఉండాలనేది ఆయన చెప్పేవారు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తూ వుంటాను" అని చెప్పుకొచ్చారు.     
muchharla aruna

More Telugu News