Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు కోపం చాలా ఎక్కువ .. అందువల్ల చాలామంది దూరమయ్యారు: కమెడియన్ వేణు

  • కమెడియన్ గా వేణుకి మంచి పేరు
  • ఈ మధ్య కోపాన్ని తగ్గించుకున్నాను 
  • కోపం తగ్గిన తరువాత సారీ చెబుతాను     
తెలుగు తెరపై సందడి చేసే కమెడియన్స్ లో వేణు ఒకరు. ఇంకా ఇంతవరకూ తనకి సరైన పాత్ర పడలేదు అంటూ .. అలాంటి పాత్ర కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ముచ్చటించాడు. "నాకు కోపం చాలా ఎక్కువ .. అందువలన చాలామందిని దూరం చేసుకున్నాను. నాకు ముక్కుమీదనే కోపం ఉంటుంది .. దాంతో వెంటనే రియాక్ట్ అవుతాను. ఆ కోపం కొంతసేపే ఉంటుంది .. కానీ ఈ లోగా జరగాల్సింది జరిగిపోతుంది.

 కోపం తగ్గిన తరువాత .. అనవసరంగా కోప్పడ్డానే అనిపిస్తుంది. అప్పుడు అవతల వ్యక్తి చిన్నవాడైనా సరే వెళ్లి సారీ చెబుతాను. నేను ఒక వ్యక్తిపై కోప్పడటం హీరోల కంటపడినా .. సీనియర్ ఆర్టిస్టుల కంటబడినా నా గురించి చెడుగా అనుకుంటారేమోననేంత దూరం నేను ఆలోచించలేదు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గించుకున్నాను .. వయసుతో పాటు అనుభవం కూడా వస్తుంది కదా" అంటూ చెప్పుకొచ్చాడు.    
venu

More Telugu News