Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోపంతో దర్శకుడు భారతీరాజా నన్ను కొట్టేశారు: అలీ

  • క్లైమాక్స్ సీన్ తీస్తున్నారు
  • ఆ సీన్లో మేమంతా నవ్వుతున్నాం 
  • కెమెరామెన్ ఆ సంగతి దర్శకుడికి చెప్పేశాడు  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ నటి ముచ్చర్ల అరుణ పాల్గొన్నారు. 'సీతాకోకచిలుక' సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. అందువలన ఆ సినిమా షూటింగు సమయంలో జరిగిన సంఘటనలను అలీ గుర్తుచేసుకున్నాడు. "నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమా .. 'సీతాకోకచిలుక'. నాకు తెలిసి ఒక్క శరత్ బాబుగారిని తప్ప దర్శకుడు భారతీరాజా గారు అందరినీ కొట్టారు. షూటింగు సమయంలో నాక్కూడా ఓ రెండు తగిలించారాయన.

ఆ రోజున క్లైమాక్స్ సీన్ ను రెండు రకాలుగా చిత్రీకరిస్తున్నారు. మేమంతా ఏదో జోక్ చేసుకుని నవ్వుతూ వుంటే, సీరియస్ సీన్లో మేము నవ్వుతున్నట్టుగా కనిపిస్తున్నామని భారతీరాజా గారికి కెమెరా మేన్ చెప్పేశాడు. ఆయన కోపంగా వచ్చి అందరినీ ఫట్ ఫట్ ఫట్ మంటూ కొట్టేసి నన్ను మాత్రం రెండుసార్లు కొట్టారు. బ్రేక్ లో నేను ఏడుస్తూ కూర్చుంటే నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు వచ్చి ఏమైందని అడిగారు. 'డైరెక్టర్ గారు కొట్టారండీ' అంటూ మళ్లీ ఏడవడం మొదలుపెట్టాను. ఊరుకోమని చెబుతూ జేబులో నుంచి రెండు వందలు తీసి ఇచ్చారు" అంటూ నవ్వేశారు.      
ali
muchharla aruna

More Telugu News