భారతీరాజా నన్ను ఫాలో అవుతూ.. మా ఇంటికి వచ్చేశారు!: ముచ్చర్ల అరుణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారతీరాజా నన్ను ఫాలో అవుతూ.. మా ఇంటికి వచ్చేశారు!: ముచ్చర్ల అరుణ

  • డాన్స్ అకాడమీలో భారతీరాజా నన్ను చూశారు 
  • నా వెనుకే మా ఇంటికి వచ్చారు 
  • తన సినిమాలో హీరోయిన్ గా చేయమన్నారు
ముచ్చర్ల అరుణ నటిగా కెమెరా ముందుకు వచ్చి చాలాకాలమే అయింది. అలాంటి ఆమె తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరియర్ గురించి ప్రస్తావించారు. " సినిమాల్లోకి వెళ్లాలి .. కథానాయిక కావాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. హైదరాబాద్ లో కాలేజ్ కి వెళ్లి చదువుకోవడం .. ఫ్రెండ్స్ తో సరదాగా గడపడం చేసేదానిని. డాన్స్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను డాన్స్ అకాడమీకి వెళ్లినప్పుడు అక్కడ భారతీరాజా గారు .. దర్శకుడు నివాస్ గారు నన్ను చూశారు.

ఆ తరువాత నన్ను ఫాలో అవుతూ మా ఇంటికి వచ్చారు. ఓ తమిళ సినిమాలో హీరోయిన్ గా చేయమని అడిగారు. 'నటనలో నాకు ఏబీసీడీలు కూడా తెలియవు .. చేయను' అన్నాను. 'ఆలోచించుకుని చెప్పండి' అనేసి వాళ్లు చెన్నై వెళ్లిపోయారు. మా నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వాళ్లు మళ్లీ వచ్చి అడిగారు. ఇది మంచి అవకాశం .. ప్రయత్నించి చూడమని మా కజిన్ అనడంతో ఓకే చెప్పేశాను. అలా తమిళ సినిమాతో నటిగా నా ప్రయాణం మొదలైంది' అని ఆమె చెప్పుకొచ్చారు.       
muchharla aruna

More Telugu News